Ad Code

సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డు పై గుంతలు కనిపించడానికి వీల్లేదు !


ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలు కనిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు తెలిపారు. నవంబర్ 1 నుంచి రోడ్ల మరమ్మతులు ప్రారంభం అవుతాయనీ, యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు జరుగుతాయని తెలిపారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని రహదారుల్లో గుంతలు పూడ్చడానికి రూ.600 కోట్లు ఇచ్చామని, అవసరమైతే మరో రూ.300 కోట్లు ఇస్తామన్నారు. కాంట్రాక్టర్లు రోడ్లను సరిగా వెయ్యకపోతే, అవి త్వరలోనే తిరిగి పాడైపోతాయి. అందుకే ఈ కూటమి ప్రభుత్వం టెక్నాలజీని వాడాలని డిసైడ్ అయ్యింది. డ్రోన్లతో రహదారుల పరిస్థితిపై సర్వే చేసి, రోడ్లు వేశాక కూడా పరిస్థితి ఎలా ఉందో డ్రోన్లతో చెక్ చెయ్యబోతున్నారు. కేంద్ర సహకారంతో రూ.55 వేల కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామనీ మరో రూ.30 వేల కోట్లతోనూ రోడ్ల నిర్మాణానికి అనుమతి వస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే కేంద్రం ఇచ్చే నిధులతో జాతీయ రహదారులే ఎక్కువగా నిర్మించే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో రోడ్లకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu