Ad Code

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నూతన లిక్కర్ పాలసీ !


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. ఇప్పటికే లాటరీ వ్యవహారం పూర్తికావడం...షాపుల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది. ఈ క్రమంలో నేటి నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. నూతన మద్యం పాలసీ అమలు నేపథ్యంలో 2014లో అందుబాటులో ఉన్న బ్రాండ్లన్నీ తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. అంతేకాదు రూ.99 రూపాయలకే ఇవ్వాలని భావించిన క్వార్టర్ బాటిల్ మద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.  లిక్కర్ షాప్స్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అని ప్రభుత్వం వెల్లడించింది. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ జరగలేదు. ఓన్లీ క్యాష్ మీద మాత్రమే అమ్మకాలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరగడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది.

Post a Comment

0 Comments

Close Menu