Ad Code

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య !


హారాష్ట్ర ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ శనివారం రాత్రి 9.30 గంటలకు బాంద్రాలోని తన కుమారుడు జీషన్ సిద్దిఖీ కార్యాలయం వెలుపల మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయనని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ కాల్పులు జరిపింది బిష్ణోయ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తున్నారు. ఆ క్రమంలో ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 66 ఏళ్ల బాబా సిద్దిఖీ బాంద్రా పశ్చిమ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ హత్య ఘటనపై విచారణను ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిద్దిఖీ హత్యపై  రాహుల్ గాంధీ తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ హత్య ఘటనతో మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. ఈ హత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో న్యాయం గెలవాలన్నారు. అయితే బాబా హత్య వార్త తనను షాక్‌కు గురి చేసిందని చెప్పారు. ఈ సందర్బంగా బాబా కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ హత్యపై ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రీయా సులే సైతం స్పందించారు. ఈ హత్య ఘటన రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతుందని అన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తికే ఈ విధంగా జరిగితే ఎలా అని ఆమె ప్రశ్నించారు. ఈ తరహా ఘటనలు ఏ మాత్రం ఆమోదయోగ్యమైనవి ఆమె స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్ర మంత్రి ఛగన్ బుజబల్ మాట్లాడుతూ.. బాబా సిద్దిఖీ హత్య కేసుతోపాటు బైకుల్లా తాలుక అధ్యక్షుడు సచిన్ కుర్మి హత్య కేసులో విచారణను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆయన విజ్జప్తి చేశారు.


Post a Comment

0 Comments

Close Menu