Ad Code

జన్‌ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ !


న్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధికారికంగా "జన్ సురాజ్ పార్టీ''ని బుధవారంనాడు ప్రారంభించారు. పాట్నాలోని బీహార్ వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ సందర్భంగా భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జన్ సురాజ్‌ను ''జన్ సురాజ్ పార్టీ''గా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈరోజు ఆమోదించిందని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా ప్రకటించారు. రెండు మూడేళ్లుగా జన్ సురాజ్ ప్రచారం సాగిస్తున్నామని, అధికారికంగా ఎప్పుడు పార్టీని తెస్తారంటూ ప్రజలు అడుగుతూ వచ్చారని, అది ఈరోజు సాకారమైందని, అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్‌లో మద్యనిషేధాన్ని ఎత్తివేస్తామని పీకే ప్రకటించారు. బీహార్‌ను ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాబోయే పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. లిక్కర్‌పై నిషేధం ఎత్తివేయడం ద్వారా వచ్చే సొమ్మును బడ్జెట్‌కు కానీ, నేతల భద్రతకు కానీ, రోడ్లు, నీళ్లు, విద్యుత్‌కు మళ్లించమని, బీహార్‌లో కొత్త విద్యా వ్యవస్థ నిర్మాణానికి మాత్రమే ఖర్చు చేస్తామని చెప్పారు. లిక్కర్‌పై నిషేధం వల్ల ఏటా రూ.20,000 కోట్లు బీహార్‌కు నష్టం వస్తోందని చెప్పారు. ఇటీవల జరిగి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారని, నాయకులు తమ ఇష్టానుసారం వ్యవహరించడాన్ని కానీ, వారి అహంకారాన్ని కానీ ఎంతమాత్రం ప్రజలు సహించేది లేదనే స్పష్టత ఇచ్చారని ప్రశాంత్ కిషోర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పొలిటికల్ కన్సెల్టెన్సీ వైపు తిరిగి వెళ్లేది లేదని, బీహార్‌ సామాజిక-ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచేందుకే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu