Ad Code

జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ?


జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ - నేషనల్ కాన్పరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతుంది. అందిన ట్రెండ్స్ మేరకు మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ - ఎన్సీ కూటమి ఏకంగా 51 చోట్ల ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. పీడీపీ 2, ఇతరులు 9 చోట్ల లీడ్‌లో ఉన్నారు. దీంతో ఇండియా కూటమ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ఇండియా కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ఇంటి వద్ద ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

Post a Comment

0 Comments

Close Menu