Ad Code

సత్యేందర్‌ జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు !


నీలాండరింగ్ కేసులో అరెస్టయిన రెండేళ్ల తర్వాత ఆప్‌ సీనియర్ నేత, ఢిల్లీ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి లావాదేవీల విషయంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2022 మే 30న సత్యేందర్‌ జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. ఈ హవాలా కేసును దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే సత్యేందర్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్య కారణాలతో గత ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. అయితే రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తిరిగి మళ్లీ తిహాడ్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 

Post a Comment

0 Comments

Close Menu