Ad Code

లెబనాన్‌కు ఔషధాలను పంపిన భారత్‌ !


లెబనాన్‌కు భారత్‌ మానవతా సాయం అందించింది. సంక్షోభ పరిస్థితుల్లో అక్కడి ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో వారికి అవసరమైన ఔషధాలను పంపించాలని నిర్ణయించింది. మొత్తం 33 టన్నుల వైద్య సామగ్రిని పంపుతున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా తొలి విడతలో 11 టన్నుల వైద్యసామాగ్రిని శుక్రవారం ప్రత్యేక విమానంలో పంపించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు. కార్డియోవాస్కులర్ ఔషధాలు, నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు, యాంటీ బయాటిక్స్‌, అనస్థీసియాకు సంబంధించిన ఔషధాలను పంపినట్లు ఆయన 'ఎక్స్‌'లో పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu