Ad Code

హాట్‌స్టార్‌లో జియో సినిమా విలీనం ?


డిస్నీ+ హాట్‌స్టార్‌ లో జియో సినిమా యాప్‌ను విలీనం చేయనున్నారని  తెలుస్తోంది. అనంతరం ఒకే యాప్‌ అందుబాటులో ఉంటుంది. విలీనం అనంతరం పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాం ఏర్పాటు కానుందని తెలుస్తోంది. తొలుత డిస్నీ+ హాట్‌స్టార్‌ నే జియో సినిమాలో విలీనం చేస్తారని భావించిన.. కొన్ని కారణాలతో జియో సినిమా యాప్‌నే విలీనం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు సహా ఇతర కంటెంట్‌ను ఉచితంగా అందిస్తున్న జియో సినిమా యాప్‌ లో త్వరలో ఎలాంటి మార్పులు రానున్నాయో తెలియాల్సి ఉంది. జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్‌ విలీనంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ తన నియంత్రణలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం గూగుల్‌ ప్లేస్టోర్‌ లో జియో సినిమా యాప్‌నకు 100 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌, డిస్నీ + హాట్‌స్టార్‌ యాప్‌నకు 500 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో రిలయన్స్ మరియు డిస్నీల మధ్య $8.5 బిలియన్‌ల విలీనాన్ని ప్రకటించారు.. ఈ ఒప్పందంతో పెద్ద నెట్‌వర్క్‌ గా నిలుస్తుంది. ఈ నిర్ణయంతో దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లు, ICC మ్యాచ్‌లు, IPL మ్యాచ్‌లు అన్ని ఒకే ప్లాట్‌ఫాం కిందకు రానున్నాయి. అయితే జియోసినిమా యాప్‌ తరహాలో ఉచితంగా వీక్షించేందుకు అవకాశం ఉందా లేదా అనే అంశంపై ప్రస్తుతం ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతం జియో సినిమా అత్యంత తక్కువ ధరలో సేవలు అందిస్తోంది. భవిష్యత్‌లో ధరల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫాంలు అధిక ధరలను వసూలు చేస్తూన్నాయి. దీంతోపాటు పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను కట్టడి చేసే అంశంలో ఇటీవలే కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ అంశాలపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu